మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం గొల్లగూడెంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్వీపర్ కూతురు అన్నీ తానై పాఠాలు చెబుతోంది. తానూ ఓ విద్యార్థినే అయినా... చిన్నారులను అల్లరి చేయకుండా చూసుకుంటూ క్రమశిక్షణలో పెట్టింది. పాఠశాలలో ఉన్న ఒకే ఒక్క ఉపాధ్యాయురాలు సెలవుపై వెళ్లింది. అందువల్ల తానే ఉపాధ్యాయురాలి బాధ్యత తీసుకుని పాఠాలు బోధించింది.
సెలవులో ఒకే ఒక్క టీచర్...
పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న గంగ సెలవులో ఉంది. ఒకే ఉపాధ్యాయురాలు ఉండటం వల్ల విద్యార్థులను చూసుకునేందుకు ఎవరూ లేరు. స్వీపర్‌గా పనిచేస్తున్న తిరుపతమ్మ కూతురు పిల్లలకు టీచర్‌గా మారి... బోధన చేసింది.
విద్యార్థులకు నష్టం వాస్తవమే...
ఇదే విషయమై మండల విద్యాధికారి మహేశ్వర్ రెడ్డిని వివరణ కోరగా.. సింగిల్ టీచర్ ఉన్నచోట ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం కష్టతరంగా మారిందని తెలిపారు. సెలవులో వెళ్లినప్పుడు విద్యార్థులకు బోధన పరంగా నష్టం జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!