మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రచారం చేశారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆయనకు సింగరేణి కార్మికులు టోపీ, కర్రను బహుమతిగా అందజేశారు. తెరాస నాయకులు బెదిరింపు, డబ్బుల పంపిణీ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అలాంటి వారి కుట్రలను ఓటు తో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి జరగాలంటే భాజపా అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. మజ్లిస్ పార్టీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. గులాబీ పార్టీ నేతల బెదిరింపులకు భయపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్, భాజపా శ్రేణులు పాల్గొన్నాాయి.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: కంపు కొడుతున్న మున్సిపాలిటీలు