ETV Bharat / state

బస్తీమే సవాల్​: 'పుర'పోరుకు "పాలమూరు" సన్నద్ధం - పురపోరు

పురపోరులో పోలింగ్​ ప్రక్రియ కోసం ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని పురపాలికలన్నీ సర్వసన్నద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు, 334 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 800లకు పైగా ఓటింగ్  కేంద్రాలను ఏర్పాటు చేయగా... 4 వేల మంది పోలింగ్ సిబ్బంది, 3వేల మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.

POLLING CENTERS READY FOR MUNICIPAL ELECTIONS IN MAHABOOBANGAR

author img

By

Published : Jan 21, 2020, 2:55 PM IST

బస్తీమే సవాల్​: 'పుర'పోరుకు "పాలమూరు" సన్నద్ధం

మున్సిపల్ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 5 జిల్లాల్లో 17 మున్సిపాలిటీలు, 338 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... 4 ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 820 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... సుమారు 5లక్షల 20వేల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మహబూబ్​నగర్​లో...

మహబూబ్​నగర్ జిల్లాలోని మహబూబ్​నగర్, భూత్పూర్ మున్సిపాలిటీల్లో పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు. ఓటర్లంతా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఒక్కో పోలింగ్ స్టేషన్​కు ఐదుగురు సిబ్బంది, 10శాతం అదనపు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారన్నారు. మొత్తం 21 ప్రాంతాలు, 63 పోలింగ్ బూత్ లను సమస్యాత్మకమైనవని గుర్తించినట్లు తెలిపారు. వెబ్​కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తామని కలెక్టర్​ వెల్లడించారు.

గద్వాల, వనపర్తిలో...

జోగులాంబ గద్వాల జిల్లాలోనూ యంత్రాంగం పోలింగ్​కు సర్వసన్నద్ధమైంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 76 వార్డులకు 154 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 558 మంది సిబ్బంది పోలింగ్ కోసం పనిచేయనున్నారు. ఇప్పటికే 95శాతం ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీలకు 80వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఒక వార్డు మాత్రమే ఏకగ్రీవమైంది. మొత్తం 162 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో 22 అత్యంత సమస్యాత్మక, 51 సమస్యాత్మక, పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. సుమారు 800 మంది పోలింగ్ సిబ్బంది, 700 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు అధికారులు వివరించారు.

నారాయణపేట, నాగర్​కర్నూల్​లో...

నారాయణపేట జిల్లాలో 3మున్సిపాలిటీల్లోని 56 వార్డులకు ఎన్నికలకు జరగాల్సి ఉండగా... ఒక వార్డు ఏకగ్రీవమైంది. 110 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 600 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. 36 సమస్యాత్మక, 14 అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి బలగాలను మోహరించినట్లు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 3 మున్సిపాలిటీల్లోని 66 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 132 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... 73వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో మొత్తం 62 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి... వెబ్​కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించనున్నట్లు పాలనాధికారి తెలిపారు.

పోలింగ్​ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా... భద్రతా బలగాల మోహరింపుతో పాటు... ఓటర్లకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

బస్తీమే సవాల్: ఓటర్లను మత్తులో ముంచుతున్న అభ్యర్థులు

నరేందర్ కొడంగల్ ఎన్నికల సామాగ్రి పంపిణీ మున్సిపల్ ఎన్నికలు పురస్కరించుకొని కొడంగల్ మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు....మంగళవారం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలకులు హైమావతి పరిశీలించారు.. జిల్లా సంయుక్త పాలనాధికారి ని అరుణ కుమారి. ఆర్డిఓ వేణుమాధవ రావు కొడంగల్ లో పొలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఎన్నికల్లో నియమించిన సిబ్బందికి అన్ని సూచనలు సలహాలు అందించారు పోలింగ్ బూతులో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు...అనంతరం సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు అందజేశారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కిరణ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ మోహన్లాల్ తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.