మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మహబూబ్ నగర్, కొల్లాపూర్, అలంపూర్, అయిజ, గద్వాల మున్సిపాలిటీల్లో ఎక్కువ మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ తెరాస, కాంగ్రెస్, భాజపా మధ్య ప్రధాన పోటీ ఉండగా... పలు చోట్ల తెరాస తిరుగుబాటు అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉంది. ఎంఐఎం, వామపక్షాలు, తెలుగుదేశం తమ ప్రాబల్యం ఉన్న చోట మాత్రమే పోటీకి దిగాయి.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఐదో వార్డు తెరాస అభ్యర్థి వనజ, వనపర్తి మున్సిపాలిటీ ఐదో వార్డు తెరాస అభ్యర్థి శాంతమ్మ, అలంపూర్ మున్సిపాలిటీ ఐదో వార్డు తెరాస అభ్యర్థి దేవన్న, కోస్గి మున్సిపాలిటీ పదోవార్డు తెరాస అభ్యర్థి అనిత ప్రత్యర్థులెవరూ పోటీలో లేకపోవటం వల్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల పర్వం ముగియడంతో రేపటి నుంచి ప్రచారం ఉందుకోనుంది.
జిల్లాల వారీగా:
మహబూబ్నగర్ జిల్లా:
మున్సిపాలిటీ | వార్డులు | పోలింగ్ స్టేషన్లు | అభ్యర్థులు | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు |
మహబూబ్ నగర్ | 49 | 240 | 238 | 48 | 40 | 36 | 114 |
భూత్పూర్ | 10 | 20 | 37 | 9 | 9 | 10 | 9 |
మొత్తం | 59 | 260 | 275 | 57 | 49 | 46 | 123 |
నారాయణపేట జిల్లా:
మున్సిపాలిటీ | వార్డులు | పోలింగ్ స్టేషన్లు | అభ్యర్థులు | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు |
నారాయణపేట | 24 | 48 | 80 | 24 | 18 | 24 | 14 |
మక్తల్ | 16 | 32 | 65 | 16 | 13 | 15 | 21 |
కోస్గి | 16 | 32 | 66 | 15 | 15 | 12 | 24 |
మొత్తం | 56 | 112 | 211 | 55 | 46 | 51 | 59 |
నాగర్కర్నూల్ జిల్లా:
మున్సిపాలిటీ | వార్డులు | పోలింగ్ స్టేషన్లు | అభ్యర్థులు | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు |
నాగర్కర్నూల్ | 24 | 48 | 104 | 24 | 23 | 24 | 33 |
కల్వకుర్తి | 22 | 44 | 79 | 22 | 22 | 16 | 19 |
కొల్లాపూర్ | 40 | 97 | 20 | 19 | 20 | 38 | 0 |
మొత్తం | 66 | 132 | 280 | 66 | 64 | 60 | 90 |
గద్వాల జిల్లా:
మున్సిపాలిటీ | వార్డులు | పోలింగ్ స్టేషన్లు | అభ్యర్థులు | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు |
గద్వాల | 37 | 75 | 137 | 37 | 25 | 36 | 39 |
అయిజ | 20 | 40 | 91 | 20 | 20 | 15 | 36 |
అలంపూర్ | 10 | 20 | 47 | 9 | 8 | 6 | 24 |
వడ్డేపల్లి | 10 | 19 | 29 | 10 | 10 | 6 | 3 |
మొత్తం | 77 | 154 | 304 | 76 | 63 | 63 | 102 |
వనపర్తి జిల్లా:
మున్సిపాలిటీ | వార్డులు | పోలింగ్ స్టేషన్లు | అభ్యర్థులు | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు |
వనపర్తి | 33 | 70 | 152 | 32 | 27 | 26 | 67 |
ఆత్మకూర్ | 10 | 20 | 36 | 10 | 10 | 10 | 6 |
అమరచింత | 10 | 18 | 40 | 10 | 5 | 9 | 16 |
కొత్తకోట | 15 | 30 | 63 | 15 | 15 | 12 | 21 |
పెబ్బేరు | 12 | 24 | 51 | 12 | 12 | 6 | 21 |
మొత్తం | 80 | 162 | 342 | 79 | 69 | 63 | 131 |
ఇవీచూడండి: 'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం'