కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జలశక్తి అభియాన్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని సంపాదించింది. ఈ నెల 29 వరకు ప్రకటించిన ర్యాంకుల్లో 83.46 స్కోర్‌తో మహబూబ్‌నగర్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జలశక్తి అభియాన్‌పై రాష్ట్రాలు, జిల్లాలను ప్రోత్సహించేందుకు తాగునీరు, పారిశుద్ధ్య శాఖ ర్యాంకుల్ని కేంద్రం ప్రకటిస్తుంది. నిర్దేశించిన 5 అంశాల్లో ప్రగతి, ప్రత్యేక చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తోంది. జల సంరక్షణ, వాననీటి సంరక్షణ, సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ, బోరుబావులు, ఇతర నిర్మాణ పునర్వినియోగం, పునరుద్ధరణ, వాటర్ షెడ్ అభివృద్ధి, అడవుల పెంపకానికి 70 శాతం, జిల్లా నీటి సంరక్షణ ప్రణాళిక, కృషి విజ్ఞాన కేంద్రాల సదస్సులకు 20శాతం మార్కులు, నిర్ణీత ఐదు వెబ్సైట్లలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని నిక్షిప్తం చేసినందుకు 10 శాతం మార్కులు వేస్తారు. ఈ మార్కులను పరిగణలోకి తీసుకుని ర్యాంకులు ఇస్తారు. దేశవ్యాప్తంగా జలశక్తి అభియాన్‌లో 254 జిల్లాలు పోటీ పడుతుండగా... మహబూబ్‌నగర్ మొదటి స్థానంలో నిలిచింది. వరంగల్ జిల్లా 15వ స్థానాన్ని దక్కించుకుంది. ఐతే ఈ ర్యాంకులు వచ్చే మార్కులను బట్టి ఏ రోజుకారోజు మారనున్నాయి.
ఇవీ చూడండి: రోడ్డుపై సినీ హీరో రౌడీయిజం- చితక్కొట్టిన జనం!