పుర ఎన్నికల ముందు ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేస్తూ తెచ్చిన జీఓను వ్యతిరేకిస్తున్నట్లు భాజపా నేత జితేందర్ రెడ్డి వెల్లడించారు. మహబూబ్ నగర్ పట్టణానికి అమృత్ పథకం కింద 160 కోట్లు వచ్చాయన్న ఆయన.. కేంద్రం నుంచి నిధులు రాకపోతే... తెరాస ఎంపీలకు ఇప్పటి వరకూ వచ్చిన నిధులు ఎక్కడివని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ మీద ప్రజలను తప్పుదోవ పట్టించి.. ఆ గందరగోళాన్ని సొమ్ము చేసుకునేందుకే ఎన్నికల ప్రకటన జారీ చేశారని అభిప్రాయపడ్డారు. సమగ్ర సర్వే నివేదికను తెరాస ఎన్నికల కోసం వాడుకుంటోదని విమర్శించారు.