ETV Bharat / state

దిశ నిందితుల మృతదేహాలు తరలింపు

author img

By

Published : Dec 8, 2019, 12:41 AM IST

Updated : Dec 8, 2019, 7:42 AM IST

disha-accused-deadbodies-transfered
దిశ నిందితుల మృతదేహాలు తరలింపు

00:34 December 08

వైద్య కళాశాల భవనానికి మృతదేహాలు తరలింపు

దిశ నిందితుల మృతదేహాలు తరలింపు

   దిశ హత్య కేసుల నిందితుల మృతదేహాలను మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రి మార్చూరి నుంచి పట్టణ శివారులో తిరుమల హిల్స్‌లోని  ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. శుక్రవారం శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాలను అక్కడే భద్రపరుచగా.. శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ పరిశీలించింది.

    ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం.. ఘటనకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకుంది. అనంతరం శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో మృతదేహాలను పోలీసులు మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని మయూరి పార్కు వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

ఇవీ చూడండి: ఎన్​కౌంటర్​ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

Intro:TG_KRN_102_07_CHERUVULO MUNIGI_YUVAKUDI MRUTHI_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------ప్రాణం తీసిన ఈత సరదా . . . పెళ్లి ఇంట్లో విషాదం! !
పెళ్లి రిసెప్షన్ రోజు ఈతకు వెళ్ళి తమ్ముడు మృతి. . .
ఈత సరదాలు ప్రాణాలు తిస్తున్నాయి . . పచ్చని తోరణాలతో,బందువులు రాకతో కళకళలాడుతున్న ఆ పెళ్లి ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది.సోదరి వివాహానికి వచ్చి సరదాగా ఈతకు వెళ్లిన నలుగురిలో ఒకరు మృతి చెందిన సంఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది....

వివారాల్లోకి వెళితే సైదాపూర్ ఎస్ఐ ప్రశాంత్ రావు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన భాషవేని రాజు(18) విద్యార్థి ఖమ్మంలోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు.ఈ నెల 6న శుక్రవారం సొంత సోదరి వివాహానికి స్నేహితులతో కలసి ఇంటికి వచ్చాడు. బంధువుల కోలాహలం మధ్య సోదరి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు.మరుపెండ్లికి సోదరి వద్దకు వెళ్లేందుకు అంతా సిద్ధమవుతుండగా రాజు తన ముగ్గురు స్నేహితులతో కలిసి సరదాగా ఊరు చెరువులోకి ఈతకు వెళ్లారు అక్కడ చెరువులో పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో రాజు అందులో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. స్నేహితులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చే లోపే రాజు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.మృతుడి తండ్రి సమ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.సమ్మయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు కాగా ఒక్కగానొక్క కుమారుడు రాజు ఉన్నారు. రాజు ను మంచి చదువులు చదివించాలని ఖమ్మంలో పాలిటెక్నిక్ చదివిస్తున్నాడు కూతురి పెళ్ళికి వచ్చి చెరువులో పడి మృతి చెందారన్న వార్త ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించింది..Body:పెళ్లింట విషాదంConclusion:యువకుడి మృతి
Last Updated : Dec 8, 2019, 7:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.