ఆపదలో ఉన్న మహిళలు, విద్యార్థులు డయల్ 100కు సమాచారం అందించి పోలీసుల సేవలు పొందాలని ఎస్సై వెంకన్న పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయల్ 100పై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
విద్యార్థినులు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని వెంకన్న సూచించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. అప్పుడే శంషాబాద్ లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్