మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని లారీ ఎడ్ల బండిని ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.
బీరిశెట్టిగూడెం శివారు పంతులు తండాకు చెందిన ధారావత్ రాజు గ్రామంలోని రైస్ మిల్లు నుంచి బియ్యం తీసుకొచ్చేందుకు ఎడ్లబండిపై వెళ్తున్నాడు. ఎస్సీ కాలనీ వద్దకు వచ్చేసరికి వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ ఎడ్లబండిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఘటనలో రాజు తీవ్రంగా గాయపడగా... ఎద్దులకు గాయాలయ్యాయి. బండి విరిగిపోయింది. క్షతగాత్రుడిని తొర్రూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇదీ చూడండి: హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి