మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన రంజిత్ అనే యువకుడు తన పల్సర్ ద్విచక్ర వాహనాన్ని ఇంటి వద్ద నిలిపాడు. ఈ బైక్‌లోనికి విషసర్పం(ఎలిషపాము) చేరింది. ద్విచక్రవాహనంలో అటూ ఇటూ తిరిగిన పాము చివరకు ముందు భాగంలోని హెడ్‌లైట్ డూమ్‌లోకి చేరింది. లైట్ల వేడికి బయటకు వెళ్లేందుకు పల్సర్ వాహనాలకు హెడ్‌డూమ్‌ల వద్ద రబ్బర్లతో కూడిన రెండు రంధ్రాలు ఉంటాయి. వీటిలో ఉండే రబ్బరును తోసుకుంటూ లోపలికి చేరిన పాము రబ్బర్లు మూసుకుపోవడం వల్ల తిరిగి బయటకు వెళ్లలేక అందులోనే ఉండిపోయింది.
ఇది గమనించని యువకుడు.. బైక్ స్టార్టు చేయడం వల్ల లైట్ వేడికి పాము చనిపోయింది. బైక్ లైట్ వెలుతురు సరిగ్గా రాకపోవడం వల్ల అనుమానం వచ్చిన వాహనదారుడు డూమ్‌ను పరిశీలించగా లోపల పాము ఉండటంతో ఖంగుతిన్నాడు. సర్వీస్ సెంటర్‌కు బైక్‌ను తీసుకెళ్లగా..లైట్ డూమ్‌ను తెరిచి పామును బయటకు తీశాడు.
- ఇదీ చూడండి : చిట్టాపూర్‌లో సుజాత.. బొప్పాపూర్‌లో రఘునందన్ రావు