ETV Bharat / state

'కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి' - MINISTER SATHYAVATHI RATHODE LATEST NEWS

అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న మహబూబాబాద్​ను ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన  జిల్లాగా ఏర్పాటు చేసి చాలా అభివృద్ధి చేశారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు.

sathyavathi
'కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి'
author img

By

Published : Dec 10, 2019, 3:54 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీకృత భవనాల సముదాయాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. మంత్రితో పాటు కలెక్టర్ శివలింగయ్య, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్​లు ఉన్నారు. 23 ఎకరాల్లో 32 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ కార్యాలయం పూర్తయితే జిల్లా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కతుందని మంత్రి తెలిపారు. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని సూచించారు. గడువులోగా నిర్మాణం పూర్తయితే ముఖ్యమంత్రి కేసీఆర్​తో ప్రారంభోత్సవం చేయిస్తానని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ 70 కోట్ల రూపాయలు మంజూరు చేశారని... ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని అన్నారు.

'కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి'

ఇవీ చూడండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.