ETV Bharat / state

ఇంకా నెరవేరని కుమురం భీం జల్​-జంగల్​​-జమీన్ ఆశయం

అతడు మన్యం ముద్దు బిడ్డా.. అలుపెరగని ఉద్యమ కెరటం. నిజాం గుండెల్లో నిద్రపోయిన గోండు బెబ్బులి. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి అసువులు బాసిన అమరుడు కుమురం భీం. జల్​.. జంగల్​.. జమీన్​ అనే నినాదమే శ్వాసగా బందూక్​ చేతబట్టి నిజాం ప్రభుత్వానికి ఎదురెళ్లి పోరాటం చేసిన యోధుడు. అతని పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. కానీ అతడి ఆశయం మాత్రం ఇంకా నెరవేరలేదు. ఏ హక్కుల కోసం భీం తుడుం మోగించాడో.. అవి ఆ గిరిజనులకు అందడంలేదు. కొమురం భీం అమరుడై 80 ఏళ్లు అవతున్నా.. నీరు, భూమి, భుక్తి గిరిజనలకు సంపూర్ణంగా చేరడం లేదు.

ఇంకా నెరవేరని కొమురం భీం జల్​-జంగల్​​-జమీన్ ఆశయం

author img

By

Published : Oct 31, 2020, 6:00 AM IST

Updated : Oct 31, 2020, 7:39 AM IST

ఆదివాసీల హక్కుల సాధనకు బెబ్బులిల గర్జించి నిజాం మూకలపై గెరిల్లా పోరాటం చేసిన మహా యోధుడు కొమురం భీం. 12 గ్రామాల గిరిజనులను ఒకటి చేసి జల్, జంగల్, జమీన్ నినాదమే శ్వాసగా బందూక్​ చేతబట్టి తుడుం మోగించారు. అలుపెరుగని, మడమ తిప్పని భీం ఉద్యమ కెరటంలా ఎగిసిపడడం వల్ల జంకిన నిజాం, ఓ నమ్మకద్రోహి సహాయంతో ఆయన్ని దొంగ దెబ్బతో హతమార్చారు. అరాచకం, నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్య్రం రాకముందే భీం చేసిన ఈ యుద్ధం ఎన్నో సాయుధ పోరాటాలకు ఊపిరి పోసింది. కొమురం భీం అసువులు బాసి 80 ఏళ్లు అవుతున్నా ఆయన నినాదమైన భూమి, భుక్తి, నీరు గిరిజనులకు అందరికీ సంపూర్ణంగా చేరడం లేదు.

జల్(నీరు) సమస్య..

జోడేఘాట్, పాటగూడ, చాల్బాడీ, పిట్టగూడ, టోకెన్ మోవాడు, కళ్లెగామ్​, లైన్ పటర్, చిన్న పాట్నాపూర్, పెద్ద పాట్నాపూర్ శివ గూడా, బాబె జరీ, కొడియన్ మోవాడ్ ఈ పన్నెండు పోరు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అప్పటినుంచి ఇప్పటివరకు నెలకొంది. వర్ధంతి సమయంలో అధికారులు తాగునీరు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం 150 మంది ఉండే పాట గూడ కు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయలేదు. గ్రామస్థులు బోరు నీరే తాగుతున్నారు. ఇది మొరాయిస్తే చెలిమెల వద్దకు వెళుతున్నారు. మిగిలిన గ్రామాలకు నీరు వస్తున్నా రంగుమారి రావడం వల్ల నీటిని తాగడానికి గిరిజనులు ఇష్టపడడం లేదు.

జంగల్( అడవి) సమస్య..

కెరమెరి మండల కేంద్రం నుంచి జోడేఘాట్​ 22 కిలోమీటర్ల పరిధిలో రెండు వరుసల రహదారి మంజూరు కాగా, ఇందులో ఎనిమిది కిలోమీటర్ల అటవీ అనుమతులు లేవనే కారణంతో నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ కంకర పరచి ఉంది. లైన్ పటార్, చాల్ బడి, కళ్లె గామ్, పిట్టగూడ గ్రామాలకు దారి సౌకర్యమే లేదు. రాళ్ల బాటలోనే ఆదివాసీలు రాకపోకలు సాగిస్తున్నారు.

జమీన్( భూమి) సమస్య..

సెప్టెంబర్ 25, 2019 హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవ సంస్థ కార్యదర్శి ఆదిలాబాద్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ జిల్లా రెవెన్యూ అధికారులతో పోరు గ్రామాల్లో పర్యటించారు. అటవీ హక్కులు లేని ఆదివాసీలకు తప్పనిసరిగా అందించాలని అధికారులకు సూచించారు. 705 ఎకరాలు సాగు చేసుకుంటున్న రైతులకు అటవీ హక్కు పత్రాలు అందించాలని అప్పుడే అధికారులు ప్రతిపాదనలు పంపిన నేటికీ పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు అందలేదు. దస్త్రాలు లేకపోవడం వల్ల ఏటా పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేస్తున్నారు.

ఇతర సమస్యలు..

వనబంధు కల్యాణ్​ యోజన పథకంలో భాగంగా బాబే ఝరిలో 28 లక్షలతో ఐదుగురు ఆదివాసీలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి పనులు ప్రారంభించారు. నేటికీ పునాదుల దశను దాటలేదు. భీం తుది శ్వాస విడిచిన జోడేఘాట్ గ్రామస్థులకు 50 మందికి రెండు పడక గదులు నిర్మించి ఇస్తామని మంత్రి కేటీఆర్ 2015లో ప్రకటించిన నేటికీ కార్యరూపం దాల్చలేదు. పోరు గ్రామాల ప్రజలందరూ పూరి గుడిసెల్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

జోడేఘాట్​లో రూ.25 కోట్ల వ్యయంతో స్మృతివనం, మ్యూజియం నిర్మించారు. ప్రస్తుతం మ్యూజియంలో క్యూరేటర్​ను నియమించలేదు. మ్యూజియానికి వచ్చే ప్రజలకు, గ్రామస్థులకు ఇక్కడ ఉన్న సాటిలైట్ వసతి గృహానికి ఒక్క చేతి పంపు మాత్రమే తాగునీరు అందిస్తుంది. హరితహారంలో పెట్టిన 17 వేల మొక్కలు కనుమరుగయ్యాయి.

భీం​ ఆశయాలు నెరవేరాలంటే..

కెరమెరి నుంచి జోడేఘాట్ వరకు నిలిచిన తారు పనులను పూర్తి చేయడంతోపాటు రహదారి సౌకర్యం లేని గ్రామాలకు రోడ్లు వేయాలి. భగీరథ నీరు 12 గ్రామాలకు నిరంతరం వచ్చేలా పర్యవేక్షించాలి. 700 ఎకరాల వరకు సాగు చేస్తున్న గిరి రైతులకు అటవీ హక్కు పత్రాలు అందించాలి. ఇక్కడి ఆదివాసీలందరికీ రెండు పడక గదుల ఇల్లు నిర్మించడంతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా ఐటీడీఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తేనే భీం ఆశయాలు నెరవేరుతాయని గిరిజనులు కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి: 'జల్​ జంగల్ జమీన్ నినాదానికి మేము నోచుకోలేదు'

Last Updated : Oct 31, 2020, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.