కుటుంబ కలహాలతో కన్న తండ్రినే గొడ్డలితో నరికి హతమార్చాడో కసాయి కుమారుడు. కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడకు చెందిన మృతుని వివరాల్లోకి వెళితే చంద్రయ్యకు నలుగురు కొడుకులు. చిన్న కుమారుడు మహేశ్ వ్యసనాలకు బానిసై తరచూ.. భూమి పంపకాలు జరపాలని గొడవ పడుతుండేవాడు.
చంద్రయ్య మధ్యాహ్నం నిద్రిస్తున్న సమయంలో కోపోద్రిక్తుడైన మహేశ్... తండ్రి మెడపై గొడ్డలితో నరకగా.. చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: బంగారం జోరుకు బ్రేకులు.. నేటి ధరలు ఇవే...