కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ ముందస్తుగా ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసులు పహారాగా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకోవడం వల్ల తోపులాట జరిగింది. అనంతరం ఆర్టీసీ కార్మికులు ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః ఎమ్మెల్యే ఆత్రం సక్కు గుస్సాడీ నృత్యాలు