కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. రాల్లగూడకు చెందిన రౌతు బండు కోత్మిర్ దహెగాం సమీపంలోని పత్తి చేనులో విగతజీవిగా పడి ఉండటం చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కాగజ్నగర్ డీఎస్పీ స్వామి, సీఐ నరేందర్ ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: 'ఆర్టీసీ సమ్మెపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి'