ETV Bharat / state

సంసారంలో చిచ్చుపెట్టిన మధ్యవర్తి.. భర్త ఆత్మహత్యాయత్నం

ఏడాది క్రితం పెళ్లి చేసుకొని అన్యోన్యంగానే ఉన్నారు. దంపతుల ప్రేమకు ప్రతిరూపంగా భార్య గర్భం దాల్చింది. అయిదో నెల నిండిన సమయంలో... ఆమెకు అత్తమామలతో అభిప్రాయ బేధాలొచ్చాయి. వాళ్లతో కలిసి ఒక్క క్షణం కూడా ఉండలేనని భార్య బెట్టు చేసింది. ఒక్కడే కొడుకు కావటం వల్ల భార్య మాటను భర్త అంగీకరించలేకపోయాడు. అది నచ్చని భార్య పెళ్లి కుదిర్చిన మధ్యవర్తిని సంప్రదించింది. ఆమెకు సర్దిచెప్పాల్సింది పోయి పెద్దమనిషి అనాలోచితంగా వ్యవహరించాడు. ఆమె అక్క భర్తను పిలిపించి పుట్టింటికి పంపాడు.

భార్య కాపురానికి వస్తలేదని ఆత్మాహత్యాయత్నం
author img

By

Published : Nov 21, 2019, 7:08 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా రెబ్బెన మండలం గోలేటికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి... భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొమురవెల్లి రామకృష్ణకు దహెగాం మండలం కొంచవెల్లికి చెందిన ఏలేశ్వరం స్వప్నతో గతేడాది మే 6న వివాహమైంది. కొంతకాలం అన్యోన్యంగానే ఉన్నారు. అయితే అత్తమామలతో ఒకే ఇంట్లో కలిసి ఉండలేనని, వేరే కాపురం పెడదామని భర్తను కోరింది. అలా కాకుంటే తన పుట్టింటి వద్ద ఉందామని కోరింది. అందుకు రామకృష్ణ అంగీకరించలేదు.

బిడ్డ పుట్టినా చెప్పలేదు

అప్పటి నుంచి నెలలు గడుస్తున్నాయి. భర్త ఎన్నిసార్లు సంప్రదించినా అత్తింటి వారి వైపు నుంచి స్పందన రాలేదు. తల్లి గారింట్లోనే భార్యకు నెలలు నిండాయి. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయం కూడా భార్య, అత్త మామలు అతనికి తెలపలేదు. ఆ ఇద్దరి మధ్య ఎడబాటు కాస్తా.. పూడ్చలేని అగాథంగా మారింది. భార్యపై ఎంతో ప్రేమ ఉన్న ఆ భర్త భార్య అర్థం చేసుకుంటుందని ఆశించాడు. ఎన్నాళ్లు గడిచినా మార్పు కనిపించలేదు. ఈ అగాధానికి కారకుడైన మధ్యవర్తి ఇంటి ముందే ఆ భర్త ఆత్మహత్యకు యత్నించే వరకు పరిస్థితి దారి తీసింది.

అప్పటి నుంచి ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాదనలు జరిగేవి. స్వప్న ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే తాను వెళ్లిన విధానం మాత్రం ఆమోదయోగ్యంగా లేదు.

మధ్యవర్తే పంపాడు!

భర్తతో విభేదించిన స్వప్న పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి గుల్బం చక్రపాణి దగ్గరకు వెళ్లి తాను పుట్టింటి వెళ్తానని కోరింది. మధ్యవర్తి వద్ద భర్త రామకృష్ణ ఆమెను ఆ పరిస్థితుల్లో పుట్టింటికి పంపేందుకు అంగీకరించలేదు. ఎలాగూ గర్భిణి కాబట్టి.. కొన్ని రోజుల్లో తల్లిగారింటికి వెళ్తుంది కదా అని రామకృష్ణను ఏమార్చి.. స్వప్నను ఆమె అక్క భర్తతో తల్లిగారింటికి పంపించాడు. అతనికి ఏం హక్కుందని తన భార్యను తీసుకెళ్లాడో చెప్పాలని రామకృష్ణ ప్రశ్నిస్తున్నాడు.

కూతురు బాధను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఆమెకు అండగా నిలిచారు. సంసారం నిలబెట్టే ప్రయత్నం చేయకుండా.. అల్లుణ్ని చులకన చేశారు. అయినా సరే భార్యను సంప్రదించేందుకు భర్త రామకృష్ణ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భార్య గర్భిణి అని తెలిసిన భర్త రామకృష్ణ ఆమె ప్రసవమైన విషయాన్ని కూడా ఏఎన్​ఎంకు ఫోన్​ చేసి తెలుసుకున్నాడు. భార్యకు ఫోన్​ చేస్తే.. పద్ధతిగా స్పందించట్లేదని, అత్త మామలూ సమస్య పరిష్కరించట్లేదని, తనకు భార్యంటే ఎంతో ప్రేమని రామకృష్ణ వాపోయాడు.

తన భార్య తిరిగి వచ్చేలా చూడాలని మధ్యవర్తి చక్రపాణిని సంప్రదించగా... నాకు సంబంధం లేదని... నీ ఇష్టం వచ్చింది చేసుకో... నా భార్యను పంపించింది నువ్వే కాబట్టి, పిలిపించమని అడిగితే... నువ్వెట్ల బతికుంటవో చూస్త అని, ఇంకోసారి నా ఇంటి రావద్దని చక్రపాణి బెదిరించాడు. మనస్తాపానికి గురైన రామకృష్ణ... నీ వల్లే నా భార్య వెళ్లిపోయిందని న్యాయం చేయకపోతే యాసిడ్​ తాగి చనిపోతానని.. అతని ఇంటి ముందే ఆత్మహత్యా యత్నం చేశాడు. ఇరుగు పొరుగు కలగజేసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే స్పందించిన పోలీసులు

వెంటనే స్పందించిన పోలీసులు యువకుణ్ని రక్షించారు. స్థానిక ఎస్సై దీకొండ రమేష్ ఆత్మహత్య వద్దని రామకృష్ణను వారించారు. బాధితునికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 10 రోజుల్లో పంచాయతీ పెట్టించి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. భార్యభర్తల గొడవలో మధ్యవర్తులు అతిగా జోక్యం చేసుకోవద్దని, సమస్య పరిష్కరించి దంపతులు అన్యోన్యంగా ఉండేలా కృషి చేయాలన్నారు. కుదరని పక్షంలో వారి ఇష్టాఇష్టాలకు వదిలేయాలి తప్ప, పెద్ద మనుషులు సమస్యను పెంచొద్దని హితవు పలికారు. మరోసారి భార్యభర్తల మధ్య జోక్యం చేసుకోవద్దని మధ్యవర్తి చక్రపాణిని ఎస్సై రమేష్ హెచ్చరించారు.

భార్య కాపురానికి వస్తలేదని ఆత్మాహత్యాయత్నం

ఇదీ చూడండి: ప్రియుడితో పెళ్లి జరగదనే భయంతో బాలిక ఆత్మహత్య

Intro:కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా:రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ కు చెందిన రామకృష్ణ (28) భార్య , స్వప్న కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురై యాసిడ్ బాటిల్ తో ఆత్మ యత్న ప్రయత్నం.

కొమురవెల్లి రామకృష్ణ గ్రామం గోలేటి భార్య ఏలేశ్వరం స్వప్న దహెగాం మండలం కొంచవెళ్లి గ్రామానికి చెందిన అమ్మాయిని గత సంవత్సరం ఐదవ నెల 6వ తారీకు 2018 న వివాహం చేసుకున్నాడు. వివాహమైన కొద్ది రోజులు అన్యోన్యంగా జీవిస్తున్న తరుణంలో మీ ఇంట్లో నేను కలిసి ఉండలేను వేరే కాపురం పెడదాం లేకపోతే మా ఇంటికి వెళ్లి అక్కడే బ్రతుకుదామని తన భార్య కోరగా నేను నా కుటుంబాన్ని వదిలేసి అత్తగారింటికి రాలేనని అని తన భర్త అన్నారు. అప్పటినుండి భార్యాభర్తలకు చిన్న చిన్న గొడవలు జరగడంతో అప్పటికి ఐదు నెలల గర్భవతి అయిన స్వప్న తమకు మధ్యవర్తిగా ఉండి సంబంధాన్ని చూసి పెళ్లి చేసినటువంటి గుల్బం చక్రపాణి ఇంటికి వెళ్లి నేను వెళ్ళిపోతాను అని అనడంతో అతను సర్దిచెప్పి తన బావను పిలిపించి అతనితో పంపించడం జరిగింది. భర్త ఎక్కడికెళ్తున్నావ్ అని ఎదురు పడితే నీవు నాకు వద్దు నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. తన భార్యా డిలివేరి అయిన విషయం కూడా తనకు తెలియకుండా దాచారని గ్రామ ఏఎన్ఎం ద్వారా తెలుసుకొని ఫోన్ చేశాడు. ఫోన్లో తనని ఇష్టారాజ్యంగా బూతులు తిట్టి హింసకు గురి చేశారు. ఇదే విషయమై మధ్యవర్తి అయినా పెద్ద మనిషి దగ్గరకు వెళ్లి నా భార్య కాపురానికి రావడం లేదు నువ్వే దగ్గరుండి పంపించావని నిలదీయడంతో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇంకొకసారి నా ఇంటి ముందుకు రావద్దు అని బెదిరింపులకు గురి చేశాడని బాధితుడు ఈరోజు యాసిడ్ సీసాతో గుల్బం చక్రపాణి ఇంటి ముందు బైఠాయించి మమ్మల్ని విడదీసింది నువ్వేనని నీవల్లే నా భార్య వెళ్లిపోయిందని నువ్వు నాకు న్యాయం చేయకపోతే ఇప్పుడే ఇక్కడే యాసిడ్ తాగి చనిపోతానని బాధితుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీంతో గ్రామ ప్రజలు కలుగ జేసుకొని 10 రోజుల్లో పంచాయతీ పెట్టి న్యాయం చేస్తామని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాBody:Tg_adb_25_21_baarya_kapuraniki_raledani_bhartha_hatma_yatnam_avb_ts10078Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.