కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కుంచెవెళ్లిలో విషాదం జరిగింది. ప్రేమించిన యువకుడితో వివాహం జరగదేమోనని.. ఓ మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. గతేడాది వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. పంచాయితీ పెట్టి బాలిక మైనర్ అవ్వడం వల్ల మేజర్ అయ్యాక వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. యువకుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లి పోయాడు. తాను ప్రేమించిన వాడితో ఎక్కడ వివాహం జరగదేమోనని ఆందోళనతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.
ఇదీ చూడండి: ప్రేమన్నాడు... పెళ్లి చేసుకున్నాడు... వదిలేశాడు