ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్ఠం చేసేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వివిధ అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ధంసలాపురం రైల్వే వంతెనను ఆరు నెలల్లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రూ.70 కోట్లతో చేపట్టిన ఈ వంతెన నిర్మాణంతో రైలు రాకపోకల సమయంలో ఇబ్బంది పడకుండా బోనకల్ మీదుగా విజయవాడ వరకు ప్రయాణం సాగించొచ్చని అన్నారు.
వెలుగుమట్ల కేజీబీవీ పాఠశాలలో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతులను ప్రారంభించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: 'పుస్తకాలు చదవాల్సిన అవసరం చాలా ఉంది'