ఖమ్మం జిల్లా మధిరలోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని రాముల వారి కల్యాణ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. సీతారాముల విగ్రహాలను అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
ఇవీ చూడండి: 'గాడీ మీద పోతున్న రేవంత్‌ను.. గడబిడ జేసిండ్రు'