సత్తుపల్లికి చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ మృతికి నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికులు, విపక్ష నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో వాగ్వాదానికి దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకునేందుకు యత్నించడం వల్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సత్తుపల్లి డిపో బంద్కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగులు కూడా విధులకు హాజరుకాలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు సమ్మె కొనసాగుతుందని విపక్ష నేతలు స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : బస్సులెక్కాలంటే ఆలోచించాల్సిందే...