ఖమ్మం జిల్లా ఏన్కూరు ఉప సర్పంచ్ వేముల రమేష్‌ను ఎమ్మెల్యే రాములు నాయక్ పరామర్శించారు. అతని కంట్లో ఎవరో దుండగులు విషపూరిత మందు చల్లారని తెలుసుకున్న ఎమ్మెల్యే... రమేష్ ఇంటికి వెళ్లి ఘటన వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెరాస కార్యకర్త మైసా రావును పరామర్శించారు. అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యల పరిష్కారం గురించి అధికారులతో మాట్లాడారు.
ఇవీ చూడండి: నిందితుల దాడిలో ఎస్సై, కానిస్టేబుల్‌కు గాయాలు: సీపీ