ETV Bharat / state

మావోల ప్రతీకారం.. 9వాహనాలు దగ్ధం.. - భద్రతా బలగాలు

ముగ్గురు మావోల మృతికి ప్రతీకారంగా మావోయిస్టులు 9 సాయుధుల వాహనాలకు నిప్పటించారు. ఛత్తీస్​గఢ్​లోని సుకుమా జిల్లాలో ఆరు టిప్పర్లు, రెండు డోజర్లు, ఒక జేసీబీపై పెట్రోల్​ పోసి తగలబెట్టారు. మావోల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

మావోల ప్రతీకారం.. 9వాహనాలు దగ్ధం..
author img

By

Published : Nov 25, 2019, 12:33 PM IST

మావోల ప్రతీకారం.. 9వాహనాలు దగ్ధం..
ఛత్తీస్​గఢ్​లోని దంతేవాడ జిల్లా కిరండల్ బైలడిల్లా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఆదివారం 9 వాహనాలకు నిప్పు అంటించి తగలబెట్టారు. ఎన్ఎండీసీ దండకారణ్యంలోని ఏఎస్సార్​ ప్లాంట్ గనిలో సాయుధులు వాహనాలను ఏర్పాటు చేసుకున్నారు. అందులోని ఆరు టిప్పర్లు, రెండు డోజర్లు, ఒక జేసీబీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ప్రతీకారం:

అయితే అంతకుముందు రోజు సుకుమా జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో డీఆర్జీ దళాలకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. ఈ ఘటనపై ఆగ్రహంతో వాహనాలు తగలబెట్టినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇవీ చూడండి: సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.