ETV Bharat / state

ఈ ఇంటికి ఎవరైనా రావచ్చు... ఏమైనా తెలుసుకోవచ్చు

పదవీ విరమణ పొందగానే బాధ్యత తీరిందనుకోలేదు. బడి నుంచి బయటికొచ్చానని వృత్తి ధర్మాన్ని వీడలేదు. సమాజం పట్ల ఉన్న సేవాభావం, వృత్తిలో అంకితభావం ఉంటే ఉద్యోగ జీవితానికి విరమణలేదని చాటిచెబుతున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. బడిలో ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ఆ చేతులతో.... మరెందరికో పుస్తక పరిజ్ఞానాన్ని అందిస్తూ... మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు.

library house in khammam by parupalli ajaykumar
ఈ ఇంటికి ఎవరైనా రావచ్చు... ఏమైనా తెలుసుకోవచ్చు
author img

By

Published : Jan 23, 2020, 6:05 PM IST

ఈ ఇంటికి ఎవరైనా రావచ్చు... ఏమైనా తెలుసుకోవచ్చు

కంప్యూటర్ యుగంలో పుస్తకాలకు తగ్గుతున్న ఆదరణ ఆయనలో ఆవేదన నింపింది. పుస్తక పఠనాన్ని మరుగునపడేస్తున్న నేటి యువత భవిష్యత్తు ఆందోళన కలిగించింది. ఆ తరుణంలోనే పుట్టిన ఓ ఆలోచనే... సగటు ఉపాధ్యాయుడికి సమాజంపై ఉన్న ఆలోచనకు అద్దం పట్టింది. ఖమ్మం పట్టణానికి చెందిన పారుపల్లి అజయ్‌కుమార్ విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన సతీమణి దుర్గాభవాని సైతం ఉపాధ్యాయురాలే.

నేటి యువతలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందిచాలన్న ఆయన ఆలోచనకు... భార్య సహకారం తోడవటంతో వెంటనే లకారం సర్కిల్‌ వద్ద గ్రంథాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గ్రంథాలయ నిర్వహణ కోసం సొంతింటిని నిర్మించి, భవనం కింది భాగంలో ప్రత్యేకంగా గ్రంథాలయ హాల్‌ను నిర్మించారు. 50 మందికి కూర్చునేలా విశాలమైన రీడింగ్‌ హాల్‌, పార్కింగ్‌ సౌకర్యం, మంచినీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పించారు.

పుస్తక పఠనం పెంచాలనే లక్ష్యంతో అజయ్‌కుమార్‌ ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయానికి ఉచిత ప్రవేశం కల్పించారు. ఉదయం 7నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ గ్రంథాలయం తెరిచే ఉంటుంది. మ్యాగజైన్లు, దినపత్రికలు, సాహిత్యం, కళలు, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఆంగ్లం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటాయి.

పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు, విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలను ప్రత్యేకంగా తెప్పించి అందుబాటులో ఉంచారు. గ్రూప్‌ పరీక్షలు, సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమయ్యే వారి సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇంటర్నెట్‌ సౌకర్యంతో డిజిటల్‌ గ్రంథాలయ సేవలను ఏర్పాటు చేశారు.

అజయ్‌కుమార్ ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం తమకు ఎంతో ఉపయోగ పడుతుందని ఇక్కడికి వచ్చే యువకులు చెబుతున్నారు. పేదరికంతో పోటీపరీక్షలకు దూరమయ్యే పరిస్థితిల్లో ఇక్కడి వాతావరణం తమను పుస్తకాలకు మరింత చేరువ చేస్తుందంటున్నారు.

ఇదీ చూడండి : 'డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కాడు..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.