కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మంలోని ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తెల్లవారు జాము నుంచే శివాలయాల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. దంపతులుగా వచ్చి దీపాలు వెలిగించారు. గుంటు మల్లేశ్వరాలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలకు రావడం వల్ల బయట రోడ్డుపై క్యూలైన్లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.
మున్నేరు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వదిలారు. ఖమ్మంలోని సుగ్గుల వారితోట శివాలయం, రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయం, జలాంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. శివుడికి అభిషేకాలు నిర్వహించారు.
ఇవీ చూడండి: కార్తీక పూర్ణిమం... శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రం