ETV Bharat / state

వైద్యం కోసం సర్కారు ఆస్పత్రికి వెళ్తున్నారా... స్మార్ట్​ఫోన్​ మరచిపోకండి - ఖమ్మం ప్రభుత్వాసుపత్రి తాజా వార్తలు

ఇన్నాళ్లు బ్యాంకులకు... హోటళ్లకు... టికెట్ల రిజర్వేషన్లకోసం చరవాణిలు తీసుకెళ్లేవాళ్లం.. కానీ ఇప్పుడు ఖమ్మం ఆస్పత్రికి వెళ్లాలంటే ఆండ్రాయిడ్​ ఫోన్​ తప్పనిసరి.. అదేంటి ఆస్పత్రుల్లో ఫోన్​ వాడొద్దని అంటారు కానీ చరవాణి పట్టుకెళ్లడం తప్పనిసరి ఏంటనుకుంటున్నారా... అయితే ఖమ్మం దవాఖానా అనుసరిస్తున్న విధానం ఏమిటో మీరూ చూడండి.

khammam hospital news
వైద్యం కోసం సర్కారు ఆస్పత్రికి వెళ్తున్నారా... స్మార్ట్​ఫోన్​ మరచిపోకండి
author img

By

Published : Dec 10, 2019, 6:13 PM IST

అక్కడ ప్రభుత్వాసుత్రికొచ్చే రోగులకు స్మార్ట్​ఫోన్​ తప్పనిసరి.. ఒకవేళ ఎవరైనా తెచ్చుకోకపోతే అన్నా ఓ సారి ఫోన్​ ఇవ్వా.. అమ్మా మీ ఫోన్​ ఒకసారి ఇస్తారా... అని అడగాల్సిన పరిస్థితి. ఇదేదో వారి బంధువులకు ఫోన్​ చేసుకోవడానికి కాదు. ఎక్స్​రే చిత్రం పంపించుకని డాక్టర్​కు చూపించి వైద్యం చేయించుకోవడానికి ఇదేం వింత పరిస్థితి అనుకుంటున్నారా అయితే మీరు ఖమ్మం సర్కారు ఆస్పత్రి గురించి తెలుసుకోవాల్సిందే..

స్మార్ట్​ఫోన్​ తెచ్చుకో... ఎక్స్​రే ఫొటో తీసుకో

ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది నిరుపేదలు, నిరక్ష్యరాస్యులే. వీరిలో చాల మందికి సెల్​ఫోన్ ఉండటమే ఎక్కువంటే...ఎక్స్​రే కోసం వచ్చేవారందరికీ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అంటున్నారు ఖమ్మం ఆస్పత్రి సిబ్బంది. డిజిటలైజేషన్ పేరుతో వస్తున్న మార్పులు ఓవైపు... ఎక్స్​రే ఫిల్మ్​ల కొరత మరోవైపు వెరసి సర్కారు దవాఖానాలో వైద్యం కోసం వచ్చే వారికి చరవాణి తిప్పలు తెచ్చిపెట్టాయి. స్మార్ట్ ఫోన్ ఉంటేనే ఆస్పత్రిలో ఎక్స్​రే తీస్తామంటున్న ఆస్పత్రి అధికారులు, సిబ్బంది నిబంధనలతో గ్రామీణ నిరుపేదలు అష్టకష్టాలు పడుతున్నారు.

అసలు రోగం కంటే ఈ స్మార్ట్ ఫోన్ కావాలనడం రోగులకు, వారి బంధువులకు కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. కనిపించిన వారినల్లా ఫోన్​కోసం బతిమిలాడుతున్నారు. రోగుల కష్టాలు చూడలేని కొంతమంది ఆస్పత్రి వైద్యులు...తమ ఫోన్లకే ఎక్స్​రేలు పంపించుకుని వారి వైద్య సేవలు అందిస్తున్నారు.

వైద్యం కోసం సర్కారు ఆస్పత్రికి వెళ్తున్నారా... స్మార్ట్​ఫోన్​ మరచిపోకండి

ఇదీ చూడండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.