ETV Bharat / state

బస్తీమే సవాల్: వేములవాడ, ధర్మపురిలో మున్సిపల్ సందడి

author img

By

Published : Jan 12, 2020, 12:17 PM IST

Updated : Jan 12, 2020, 1:42 PM IST

తెల్లవారుజామున సుప్రభాతం వినిపించే ఆ క్షేత్రాల్లో.. ఇప్పుడు రాజకీయ మైకుల గోల ఎక్కువైంది. వేములవాడ, ధర్మపురి పుణ్యక్షేత్రాల్లో మున్సిపల్‌ ఎన్నికల సందడి జోరందుకుంది. ఈ ఆలయాల్లో కొన్నేళ్లుగా పారిశుద్ధ్యం, రహదారులు సమస్యలు, తాగునీరు ఇక్కట్లు పెరిగిపోతున్నాయి. భక్తుల సౌకర్యాల విషయంలో పట్టింపు కరువైంది.

వేములవాడ, ధర్మపురిలో మున్సిపల్ సందడి
MUNICIPAL ELECTIONS IN VEMULAWADA, DHARMAPURI
వేములవాడ, ధర్మపురిలో మున్సిపల్ సందడి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన వేములవాడ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రధాన పార్టీల నాయకులు కసరత్తులు చేస్తున్నారు. గతంలో 20 వార్డులతో నగర పంచాయతీగా ఉన్న వేములవాడ...సమీప గ్రామాల విలీనం వల్ల 28 వార్డులతో పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. వేములవాడ ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ పట్టణం...సమస్యల వాడగా మారింది. ఇరుకుదారులతో రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు...కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి ప్రాధికారసంస్థ- VTADAను ఏర్పాటు చేసినప్పటికీ గత ఐదేళ్ల కాలంలో అనుకున్న స్థాయిలో పనులు జరగలేదంటున్నారు స్థానికులు. పట్టణంలో దుర్వాసన, పందులు, దోమల వ్యాప్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తెరగాలని కోరుతున్నారు.

వేములవాడను ప్రత్యేక జోన్​గా గుర్తించాలి..

రాజన్న ఆలయంలో మహా శివరాత్రి జాతర, శ్రీరామనవమి, శివకల్యాణం, కార్తీకపౌర్ణమి, ముక్కోటి ఏకాదశితో పాటు ప్రతి ఆది, సోమవారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తుంటారు. అయినా కనీస అభివృద్ధి జరగటం లేదనే అసంతృప్తి స్థానికుల్లో, భక్తుల్లో కనిపిస్తోంది. వేములవాడ పట్టణంలో సరిగ్గా ప్రజా మరుగుదొడ్లు లేకపోవడంతో గుడిచెరువు మైదానం అపరిశుభ్రంగా మారుతోందని.. మూలవాగులో నీటికి బదులు మురుగు, పందులు దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. బద్దిపోచమ్మ ఆలయాన్ని విస్తరించడమే కాకుండా. ఆలయాలు ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా గుర్తించి దారులు మరమ్మతులు చేసేందుకు చొరవ చూపాలని కోరుతున్నారు. వేలాది మంది తరలి వచ్చే వేములవాడ పట్టణానికి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ధర్మపురిలో భక్తులు గోస పట్టదా..!

కొత్తగా ఏర్పడిన ధర్మపురి పురపాలక సంఘంలోనూ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన పార్టీలన్నీ నువ్వానేనా అన్నట్లు సాగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొలువైన ఈ పట్టణం సమస్యలకు నిలయంగా మారింది. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుండగా కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి నదిని ఆనుకుని ఉన్నప్పటికీ ఏటా వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది ధర్మపురి. గోదావరి నదిలో కలుస్తున్న మురుగు నీటిలోనే స్థానికులు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించాల్సి వస్తోంది. ఈ అంశంపై భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధర్మపురి క్షేత్రానికి ప్రతి రోజూ దాదాపు 10 వేల మంది భక్తులు వస్తుంటారు. ప్రతి వాహనానికి 50రూపాయల రుసుము వసూలు చేస్తున్నా పార్కింగ్‌కు మాత్రం ఎక్కడా స్థలం కేటాయించలేదు. పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నగా మారింది. అంతర్గత రహదారుల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది అంటుంటారు..ధర్మపురి వాసులు. ప్రధాన మార్గాలన్నీ గుంతల మయంగా మారాయి. కనీస సదుపాయల గురించి పట్టించుకునే నాథుడే లేడంటున్నారు స్థానికులు.

మొత్తంగా...ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా పెరుగాంచిన వేములవాడ, ‌ధర్మపురి పట్టణాలు భక్తి భావానికే కాకుండా... సమస్యలకూ నిలయాలుగా మారాయి. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రాల్లో సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: తిరుగుబాటు అభ్యర్థుల్ని బుజ్జగిస్తున్న పార్టీలు

Intro:TG_KRN_03_09_ATTAN_MUNC_DHARMAPURI_PKG_TS10041_TS10086

Body:TG_KRN_03_09_ATTAN_MUNC_DHARMAPURI_PKG_TS10041_TS10086

Conclusion:
Last Updated : Jan 12, 2020, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.