ETV Bharat / state

మిలియన్​ మార్చ్​ విజయవంతం: బండి సంజయ్​ - TSRTC Strike today news

ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చిన మిలియన్​ మార్చ్​ విజయవంతమైందన్నారు కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​. పోలీసుల నిర్బంధాలను ఛేదించుకుని వేలాది మంది ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్​కు చేరుకున్నారని తెలిపారు.

MP bandi sanajy said today RTC million march success
author img

By

Published : Nov 9, 2019, 6:31 PM IST

ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన మిలియన్​ మార్చ్​ను ఉక్కుపాదంతో అణచివేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నించినప్పటికీ... అడ్డుకోలేక పోయారని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రెండు రోజుల నుంచే హైదరాబాద్​తో పాటు వివిధ జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసినప్పటికీ మిలియన్​ మార్చ్ విజయవంతమైందని తెలిపారు. ప్రభుత్వ నిర్బంధాలను, పోలీసు వలయాలను చేధించుకుని వేలాది మంది ట్యాంక్​బండ్​కు చేరుకున్నారన్నారు. ఉద్యమ సత్తా చాటిన అందరికీ హ్యాట్సాఫ్ అని ఎంపీ అభినందించారు. పోలీసుల దాడిలో గాయపడ్డ కార్మికులు, వివిధ పార్టీల కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పోలీస్​ అధికారులు ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు ఒత్తకుండా... మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సంజయ్​ హెచ్చరించారు.

మిలియన్​ మార్చ్​ విజయవంతం:బండి సంజయ్​

ఇవీ చూడండి:పోలీసులపై రాళ్లు... ఆందోళనకారులపై బాష్పవాయువు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.