ప్రజలు నాపై నమ్మకంతో ఏడు సార్లు గెలిపించారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్‌లో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయనతో పాటు చినజీయర్ స్వామి హాజరయ్యారు. ఆయన పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలలో పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్నారు. మంత్రి దయాకర్‌రావు చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. సీతారామచంద్ర స్వామి ఆలయానికి దాతలు ముందుకు రావటం శుభ పరిణామన్నారు.