కరీంనగర్ ఆర్టీసీ డ్రైవర్ ఎన్.బాబు ఇంటి వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. డ్రైవర్ మృతదేహాంతో మూడో రోజులుగా కుటుంబ సభ్యులు, నేతలు బైఠాయించారు. బుధవారం గుండెపోటుతో డ్రైవర్ ఎన్.బాబు మృతిచెందాడు.
ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు జరిపే వరకు అంత్యక్రియలు జరపబోమని చెబుతున్నారు. బాబు మృతదేహానికి టీఎన్జీవో జిల్లా నేతలు నివాళులర్పించారు. నిరసనలో ఎంపీ బండి సంజయ్, మందకృష్ణ మాదిగ, ఆర్టీసీ ఐకాస నేతలు పాల్గొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ కరీంనగర్ పట్టణంలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది.
ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'