కరీంనగర్ నగరపాలక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారందరికి ఓటుకు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈనెల 27న ఓట్ల లెక్కింపు చేపడుతారు.
టెండర్ ఓట్లు వేసిన మూడు వార్డుల్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కామారెడ్డి పురపాలక సంఘంలో 41వ వార్డులోని 101 పోలింగ్ కేంద్రం, బోధన్‌లోని 32వ వార్డు పరిధిలోని 87వ పోలింగ్ కేంద్రం, రెండు టెండర్ ఓట్లు వేసిన మహబూబ్‌నగర్‌లో 41 వార్డులోని 198 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ సాజావుగా సాగింది.