కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్ హజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్పర్సన్, ఇతర నేతలు మంత్రులను సత్కరించారు. సమావేశంలో పలువురు సభ్యులు ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలపై ప్రస్తావించారు. గత సీజన్‌లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి దళారీలు ధాన్యం తీసుకొచ్చి తెలంగాణలో మద్దతు ధరకు అమ్ముకున్నారన్న అంశంపై విచారణ జరిపిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నిజ నిజాలు తేలాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతిగింజ కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రజాప్రతినిధులు అన్ని సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని చేతులు ముడుచుకోవద్దని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: సాహసం... క్రమశిక్షణ... కలబోతే ఎన్సీసీ