కరీంనగర్ జిల్లా అల్గునూర్‌కు చెందిన చిందెం సాయి కిరణ్, రాంనగర్‌కు చెందిన దాసరి సాయి కృష్ణ అల్గునూర్ నుంచి మానకొండూరుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎదిగిన బిడ్డలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా 15మంది అదనపు ఎస్పీల బదిలీ