ETV Bharat / state

అక్కడ నీది నాది ఒకటే నినాదం.. ఇంటికి వంద-బడికి చందా - money give to school for develop in kamareddy

అక్కడ నీది నాది ఒకటే నినాదం.. ఇంటికి వంద- బడికి చందా   అక్కడి వాళ్లంతా చందాలు పోగేస్తున్నారు. వినాయక చవితికో లేక వేరే ఇతర కార్యక్రమాల కోసం అనుకుంటే పొరబడినట్లే! తమ గ్రామ పిల్లల బంగారు భవిష్యత్​ కోసం వారు చందాలు వేసుకుంటున్నారు. ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులను కాపాడుకోవడానికి అంతా కలిసి ముందుకొచ్చారు. "బడికి చందా- ఇంటికి వంద" అనే నినాదంతో ప్రభుత్వ పాఠశాలను బాగుచేస్తున్నారు. గ్రామస్థుల చందాలతో ఆదర్శ పాఠశాలగా రూపుదిద్దికుంటోంది కామారెడ్డి జిల్లాలోని ఇస్రోజివాడి ప్రాథమిక బడి.

money give to school for develop in kamareddy
అక్కడ నీది నాది ఒకటే నినాదం.. ఇంటికి వంద-బడికి చందా
author img

By

Published : Dec 22, 2019, 8:40 AM IST

Updated : Dec 22, 2019, 10:32 AM IST

అక్కడ నీది నాది ఒకటే నినాదం.. ఇంటికి వంద-బడికి చందా

సాధారణంగా గుడి నిర్మాణానికో, ఉత్సవాల నిర్వహణకో చందాలు వసూలు చేయడం చూస్తుంటాం. కానీ తొలిసారిగా కామారెడ్డి జిల్లాలోని ఇస్రోజివాడి గ్రామస్థులు మాత్రం బడి బాగు కోసం చందాలు వసూలు చేస్తున్నారు. ఎవరూ పట్టించుకోకున్నా.. గ్రామంలోని బడిని బాగు చేయాలన్న సంకల్పంతో ప్రజలు ముందుకొచ్చారు. ఇంటికి వంద చొప్పున సేకరించి పాఠశాలను అభివృద్ధి చేసుకునేందుకు గ్రామమంతా ఏకతాటిపైకి వచ్చింది.

బడిని బాగు చేసుకోవాలని తీర్మానం..

గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గతేడాది వరకు కేవలం 40లోపు విద్యార్థులుండేవారు. ప్రస్తుతం 138 మంది విద్యార్థులున్నారు. కనీస వసతులు లేకపోవడం, సరిపడా ఉపాధ్యాయులు, సిబ్బంది లేక గ్రామస్థులంతా కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకున్నారు. బడిని బాగు చేసుకోవాలని తీర్మానించారు. ఇందుకోసం ముందుగా ప్రతి ఒక్క విద్యార్థిని ఊరిలో ఉన్న సర్కారు బడికే పంపాలని నిర్ణయించారు.

ఇంటికో వంద..

ఈ చర్య వల్ల విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగింది. సరైన సంఖ్యలో ఉపాధ్యాయులు లేకపోవడం, మౌలిక వసతుల కొరత ఉండడం వల్ల దాన్ని అధిగమించేందుకు ఆలోచన చేశారు. ఇంటికి రూ.వంద చొప్పున విరాళం సేకరించి బడి అభివృద్ధికి కేటాయించాలనుకున్నారు. ఇందుకోసం గ్రామంలోని యువత ఇంటింటికీ తిరుగుతూ చందాలు వసూలు చేస్తున్నారు.

గ్రామస్థుల చందాలు..

పాఠశాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ తరపున రూ.50వేలు అందించగా.. కొందరు దాతలు మరో రూ. 50వేలు అందించారు. ఇవి కాకుండా గ్రామంలో ఉన్న 1,100 కుటుంబాల నుంచి ఇంటికి 100 చొప్పున మరో రూ.లక్ష వరకు సమకూరనుంది. రూ.2లక్షలతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు మాత్రమే ఉపాధ్యాయులు ఉండగా.. ఇద్దరు విద్యా వలంటీర్లను నియమించుకున్నారు.

మౌలిక వసతులపై దృష్టి..

మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా మంచినీరు, మూత్రశాలలు బాగు చేసుకున్నారు. పాఠశాల పూర్తిగా వెలిసిపోయి ఉండడం వల్ల భవనానికి, పిల్లలు కూర్చునే బల్లలకు రంగులు వేయించనున్నారు. ప్రహరి గోడ బీటలు వారి, కొన్ని చోట్ల కూలిపోయింది. పాఠశాల ప్రాంగణంలోని గోడలన్నింటికీ విద్యార్థులకు జ్ఞానం పంచేలా బొమ్మలు వేయించనున్నారు.

ప్రతిభకు సానపెడుతున్న విద్యార్థులు..

గ్రామస్థులు అందిస్తోన్న ప్రోత్సాహంతో విద్యార్థులు ప్రతిభకు సాన బెడుతున్నారు ఉపాధ్యాయులు. ఇప్పటికే ఎండిపోయిన ఆకులతో వివిధ రకాల జంతువుల బొమ్మలను తయారు చేశారు. బడి బాగు కోసం ఊరంతా కదలడాన్ని అంతా హర్షిస్తున్నారు. అన్ని గ్రామాలూ ఇలాగే ముందుకొస్తే సర్కారు బడులన్నీ ప్రైవేటుకు దీటుగా మారిపోతాయి. ఇస్రోజివాడి గ్రామస్థుల ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.

ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్​సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి

sample description
Last Updated : Dec 22, 2019, 10:32 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.