జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం రాజపురం గ్రామంలో అంగన్వాడీ పాఠశాల గోడ కూలి మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. వీరుపాక్షమ్మ, గోపాల్ కుమారుడు అంగన్వాడీ భవనం దగ్గర వరండాలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా కొత్తగా నిర్మించిన గోడ కూలిపోయింది. ఈ ఘటనలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. పసిబాలుడు చనిపోవటం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి : శిశువు మరణంపై కలెక్టర్ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్