ETV Bharat / state

కాళేశ్వరంపై కౌంటర్​కు సర్కారుకు రెండువారాల గడువు.. - కాళేశ్వరం ప్రాజెక్టు

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రైబ్యునల్​లో దాఖలైన పిటిషన్​పై విచారణ జరిగింది. కౌంటర్​ దాఖలుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది.

kaleshwaram project
author img

By

Published : Oct 30, 2019, 1:20 PM IST

Updated : Oct 30, 2019, 4:26 PM IST

పర్యావరణ అనుమతులు సరిగా లేవంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్​లో దాఖలైన పిటిషన్​పై విచారణ నవంబర్ 13కి వాయిదా పడింది. ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు చేసిన తర్వాత తీసుకున్న పర్యావరణ అనుమతులను సవరించలేదని పిటిషనర్ హయాతూద్దీన్ మధ్యంతర పిటిషన్​ దాఖలు చేశారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ఎత్తిపోతల పథకాల సామర్థ్యం పెంచిన తర్వాత అంతకుముందు తీసుకున్న పర్యావరణ అనుమతుల సవరణ కోరలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. మధ్యంతర పిటిషన్​​పై సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరినందున... ఎన్జీటీ రెండు వారాల గడువు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణ నవంబర్ 13న జరగనుంది.

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

Last Updated : Oct 30, 2019, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.