ETV Bharat / state

వైద్య విద్యార్థి దారుణ హత్య - telangana latest crime news

తమ కుమారుడికి వైద్య విద్యా సీటు వచ్చిందని సంతోషపడ్డారు. త్వరలో వైద్యుడు కాబోతున్నాడని ఊరంతా చెప్పుకున్నారు. వారి ఆశయానికి తగ్గట్లుగానే వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు కొడుకు. విజయవంతంగా రెండేళ్లు ముగించి మూడో సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన  ఆ కుమారుడు బావిలో శవమై తేలాడు. కొడుకు శవాన్ని చూసిన కన్నవారు గుండెలవిసేలా ఏడ్చారు. తమ బిడ్డను ఎవరు చంపారంటూ కన్నీరుమున్నీరయ్యారు.

medical student brutal murder in jayashankar bhupalapally district
వైద్య విద్యార్థి దారుణ హత్య
author img

By

Published : Jan 18, 2020, 6:02 PM IST

Updated : Jan 18, 2020, 6:41 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తికి చెందిన వైద్య విద్యార్థి తుమ్మలపల్లి వంశీ(28)ని గుర్తు తెలియని దుండగులు కాళ్లు, చేతులు కట్టేసి బావిలో పడేశారు. ఖమ్మం జిల్లాలోని మమత మెడికల్ కాలేజీలో వంశీ ఎంబీబీఎస్​ మూడో సంవత్సరం చదువుతున్నారు. సెలవుల నిమిత్తం ఊరొచ్చాడు. సెలవులు ముగించుకొని ఖమ్మం బయల్దేరుతున్న అని ఇంట్లో చెప్పి బయల్దేరారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో తల్లిదండ్రులు ఫోన్ చేయగా కాలేజికి చేరుకున్నట్లు సమాచారం అందించాడు.

సీసీ ఫుటేజ్​ ఆధారంగా విచారణ

యథావిధిగా అతని తల్లిదండ్రులు ఈరోజు ఉదయం పొలం వద్దకు వెళ్లగా వంశీకి చెందిన బ్యాగు, చెప్పులు కనిపించాయి. పరిశీలించగా బావిలో వంశీ శవమై కనిపించాడు. వెంటనే పోలీసులు, ఊరి వారికి సమాచారమందించగా వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బావి వద్ద ఉన్న విద్యుత్​ స్తంభానికి సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.

వైద్య విద్యార్థి దారుణ హత్య

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్​నగర్ కార్పొరేషన్

sample description
Last Updated : Jan 18, 2020, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.