ఆర్టీసీ ఛార్జీల పెంపులో దోపిడీ కోణం దాగి ఉందని.. రాష్ట్రంలో కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
మాట మార్చే కేసీఆర్‌లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని... పొన్నాల ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధికోసమే ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో చర్చలు జరిపారని ఆరోపించారు.
ఇవీచూడండి: 'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'