జనగామ జిల్లా తరిగొప్పులలో దారుణం చోటుచేసుకుంది. జీవితం మీద విరక్తి చెంది గాలి కౌసల్య అనే వివాహిత కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. చిన్నప్పటి నుంచే కౌసల్య అంగవైకల్యంతో బాధపడుతుండేది. దీనికి తోడు ఇటీవల పక్షవాతం వచ్చింది.
మనస్తాపంతో మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.