ఆహార పదార్థాలను కల్తీ చేస్తే చట్టం నుంచి తప్పించుకోలేరని జనగామ జిల్లా ఆహార భద్రత అధికారి జ్యోతిర్మయి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించి పలు దుకాణాలను సీజ్ చేశారు. పట్టణంలోని ప్రతి వ్యాపారి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
రంగు కలిపిన ఆహార పదార్థాలు, నాణ్యతలేని ఆహారం, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వినియోగదారులకు అందించినట్లయితే సదరు యజమానులకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని ఆమె హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'పౌర' చట్టం రాజ్యాంగబద్ధత పరిశీలనకు సుప్రీం ఓకే