ETV Bharat / state

దేవాదులలోకి దూసుకెళ్లిన ఆటో... తరువాత ఏమైందంటే..!

ముందు టైరు పగిలిపోయి ఓ ఆటో దేవాదుల జలాశయంలోకి దూసుకెళ్లింది. ఆటో వెనకాలే వస్తున్న వాహనదారులు నీటిలో మునిగిపోతున్న ప్రయాణికులను రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

author img

By

Published : Oct 26, 2019, 9:16 PM IST

దేవాదుల జలాశయంలోకి దూసుకెళ్లిన ఆటో

జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ మండలం తాటికొండ గ్రామం నుంచి స్టేషన్ ఘనపూర్​కు ఏడుగురు ప్రయాణికులతో వస్తున్న ఆటో దేవాదుల జలాశయంలోకి దూసుకెళ్లింది. ముందు టైరు ఒక్కసారిగా పగిలిపోవడం వల్ల అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఆటో వెనకాలే వస్తున్న వాహనదారులు వెంటనే స్పందించి జలాశయంలో పడిపోయిన ప్రయాణికులను రక్షించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం వరంగల్​లోని ఆసుపత్రికి తరలించారు. ఆటోలో పరిమితి కంటే ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని స్థానికులు తెలిపారు.

ఇవీ చూడండి: కాలువలోకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు యువకులు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.