జగిత్యాల జిల్లా మల్యాలలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఓ బాలుడు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో శవంగా దొరికాడు. ఏడో తరగతి చదువుతున్న బాలుడు సోమవారం ఇంట్లో నుంచి వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో తలిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా మృతదేహాన్ని గుర్తించారు. అయితే బావిలోకి ఈతకు వెళ్లాడా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి : "విలీనం" మినహా మిగతా డిమాండ్ల పరిశీలనకు కమిటీ