రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలికి పిల్లలు, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉదయం మంచు ఎక్కువ కురుస్తున్నందున రాహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారంరోజుల నుంచి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. ఉపశమనం పొందేందుకు ప్రజలు చలి మంటలు కాసుకుంటున్నారు. చలిని దృష్టిలో పెట్టుకుని చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండిః చలి పెడుతోందని ఎక్కువగా తాగేస్తున్నారు...!