సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె 42 రోజూ జోరుగా కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. పట్టణంలోని జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీధుల్లో తిరుగుతూ ప్రజలకు కార్మికుల కష్టాలను వివరించారు. అనంతరం డిపో వద్ద వంటావార్పు నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.
ఇదీ చూడండి : 'కారు'లో ముసలం... పాలేరులో 'కమిటీ'ల పంచాయితీ!