జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 14వ వార్డు భాజపా అభ్యర్థి ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కమలం గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్ల కాళ్లపై పడుతున్నారు. మాజీ కౌన్సిలర్ కావడం వల్ల గతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మహిళలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వస్తుండడం వల్ల అప్పటివరకు నిలబడి నమస్కరించి ఒక్కసారిగా కాళ్లపై పడి ఓటు అభ్యర్థించారు. ఓటర్లు అవాక్కయ్యారు.
ఇవీచూడండి: ఏఐ విప్లవానికి తెలంగాణ సిద్ధం: కేటీఆర్