జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏ ఎస్సారెస్పీ కాకతీయ కాల్వలో గల్లంతయ్యాడు. ధరూర్ క్యాంపులో అపార్టుమెంట్లో ఉంటున్న గిరిశ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి కెనాల్‌లో ఈతకు వెళ్లాడు. గిరీశ్‌కు ఈత రాక నీటిలో కొట్టుకు పోయాడు.. స్నేహితులు కాపాడేందుకు యత్నించగా ఫలించలేదు. పోలీసులు రంగంలోకి దిగి వెతుకులాట ప్రారంభించారు. గిరిష్ పంచాతీరాజ్‌శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ ఎమ్మెల్యే వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్నాడు.. గతంలో ఎమ్మెల్యే ఎల్.రమణ వద్ద కూడా పీఏగా పని చేశాడు.
- ఇదీ చూడండి : కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో ఉద్రిక్తత