ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చట్టాల మీద నమ్మకం లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ నరేశ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ వేస్తామంటే ఎందుకు వద్దంటున్నారో తెలియడం లేదన్నారు.
కష్టజీవులు బిగించాల్సింది ఉరితాళ్లు కాదని.. పిడికిళ్లు బిగించాలని కార్మికులలో మనో మనో ధైర్యం నింపారు. ప్రభుత్వ విధానాలతో ఆందోళన చెంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: అశ్వత్థామరెడ్డిని అడ్డుకున్నారు.. విడిచి పెట్టారు