డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్టీసీ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డ్రైవింగ్ వృత్తిపట్ల ప్రతి ఆర్టీసీ డ్రైవర్‌కు అవగాహన కల్పిస్తూ... ప్రయాణికులను సురక్షితంగా ఎలా గమ్యస్థానాలకు చేర్చాలో వివరిస్తున్నారు మేనేజర్ విజయరావు.
డ్రైవర్ల చేతికి గులాబీ పువ్వులు అందిస్తూ అతివేగం వద్దంటూ చెబుతున్నారు. ఆర్టీసీని నమ్ముకొని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు నమ్మకం కలిగేలా ఆర్టీసీ ఉద్యోగులు విధులు నిర్వర్తించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాలని సూచించారు.
ఇవీ చూడండి: కరీంనగర్ నగరపాలికలో ప్రశాంతంగా పోలింగ్