దీపావళి పండుగను దుబాయిలోనూ ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పండుగ సందర్భంగా దుబాయ్ నగరం విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోయింది. నోరూరించే వందలాది రకాల మిఠాయిలను దుకాణాల్లో అందుబాటులో ఉంచారు. అక్కడి తెలుగు ప్రజలు ఈ వేడుకను ఉత్సహంగా జరుపుకున్నారు. బాణసంచా కాలుస్తూ సంబురాలు నిర్వహించుకున్నారు. తెలుగు ప్రజలకు దుబాయిలో ఉంటున్న యువకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: ఉవ్వెత్తున ఎగిసిన మంటలు... విద్యుదాఘాతమే కారణం!