ETV Bharat / state

పైశాచిక ఆనందంలో యువత

హత్య.. ఆత్మహత్య... రోడ్డు ప్రమాదం.. ఇలా ఏది జరిగినా  సామాన్యులు  అయ్యో అనుకుంటుంటే.. కొందరు యువత మాత్రం పైశాచిక ఆనందం పొందుతున్నారు. కనీస సానుభూతి కూడా లేకుండా సెల్ఫీలు, ఫొటోలు,  వీడియోలు తీయడం, సామాజిక మాధ్యమాల్లో అనుచిత కామెంట్లు పెడుతూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా దిశ ప్రవర్తనపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

author img

By

Published : Dec 5, 2019, 8:01 AM IST

Updated : Dec 5, 2019, 11:07 AM IST

పైశాచిక ఆనందంలో యువత
పైశాచిక ఆనందంలో యువత
పైశాచిక ఆనందంలో యువత

దిశ అత్యంత కఠినమైన పరిస్థితుల్లో నలుగురు కామాంధుల చేతికి చిక్కి బలైపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనిపై సామాజిక మాధ్యమాల్లో దిశకు అందరూ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ జస్టిస్ ఫర్ దిశ​ అని పోస్టులు పెడుతుంటే... కొందరు పోకిరీలు మాత్రం ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. వాట్సప్, ఫేస్ బుక్​లలో అసహ్యంగా కామెంట్లు పెట్టడమే కాక.. అమె ప్రవర్తనపై కూడా అనుచిత కామెంట్లు చేస్తున్నారు. దీనితో వారిపై నెటిజెన్లు దుమ్మెత్తి పోశారు.

ఆ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన హైదరాబాద్​ సీసీఎస్ పోలీసులు.. అసభ్య కామెంట్లు చేసిన ఫేస్ బుక్ 'స్మైలీ నానీ గ్యాంగ్' గ్రూప్​లో ఉన్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మంగళవారం నిజామాబాద్​కు చెందిన శ్రీరామ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బుధవారం గుంటూరు జిల్లా అమరావతికి చెందిన ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ నానిని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. మరో వైపు రాయదుర్గంలోని ఓ మహిళ వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో అనిల్ కుమార్ అంబాల అనే వ్యక్తిని సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో అర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ద్విచక్ర వాహనంపై వెళుతున్న టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనా అక్కడికక్కడే మృతి చెందింది. ఓ వైపు భార్య చనిపోయిందని భర్త తీవ్రంగా రోదిస్తుంటే.. మరో వైపు ఓ పోకిరీ మృతదేహం ముందు ఏ మాత్రం మానవత్వం లేకుండా సెల్ఫీ తీసుకుంటూ మూర్ఖుడిలా ప్రవర్తించాడు. చదువుకున్న యువకులు, ఉద్యోగం చేస్తున్నవారే ఇలా మానవాతారాహిత్యంగా ప్రవర్తించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువత ఆలోచనలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని.. వారు పెడదారి పట్టకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉందని సామాజిక నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా ఐసీజేఎస్​.. ఆన్​లైన్​లో నేర విచారణ

TG_HYD_01_05_YOUTH_WRONG_WAY_PKG_3182400 రిపోర్టర్ నాగార్జున note: TG_HYD_24_03_DISHA_ARREST ఫైల్ లోని విజులల్స్ వాడుకోగలరు TG_HYD_01_05_YOUTH_WRONG_WAY_PKG_3182400- ఈ ఫైల్ తో డెస్క్ వాట్సప్ కి వచ్చిన ఫోటోలు, విజువల్స్ వాడుకోగలరు ( )హత్య జరిగినా ఆత్మహత్య జరిగినా ...రోడ్డు ప్రమాదం జరిగినా ...ప్రమాద వశాత్తు చనిపోయినా....సామాన్య ప్రజలు అయ్యో అనుకుంటుటే..కొందరు యువత మాత్రం పైశాచిక ఆనందం పొందుతున్నారు...కనీస సానుభూతి కూడా లేకుండా వీడియోలు, ఫోటోలు తీయటంతో పాటు సమాజిక మాధ్యమాల్లో దారుణమైన, అమానవీయమైన అంశాలను పొందుపరుస్తూ... సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారి వెనుక నిలబడి వారి ఆర్తనాదాలను సామాజిక మాద్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. చేతిలో ముబైల్ ఉంటే విచక్షణ మరిచి అన్ని సామాజిక మాధ్యామాల్లో పెట్టేస్తున్నారు. అంతే కాకుండా వాటిపై అసభ్యకరంగా వ్యగ్యంగా కామెంట్లు పెట్టి బాధిత కుటుంబాలను మరింత క్షోబకు గురి చేస్తున్నారు. దిష హత్యోధంతంపై దారుణమైన కామెంట్లు చేసిన ముగ్గురిని పోలీసులు కటకటాల్లోకి నెట్టి గట్టి హెచ్చరిక జారీ చేశారు. బైట్ అవినాష్ మహంతి, సైబర్ క్రైం డీసీపీ వాయిస్ దిషా...అత్యంత కఠినమై పరిస్థితుల్లో నలుగురు కామాంధుల చేతికి చిక్కి బలైపోయింది.. ఈ ఘటన దేశవ్యాప్తంగా సచలనం సృష్టించింది..అయితే దీనిపై సోషల్ మీడియా లో దిషాకు అందరూ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ జస్టిస్ ఫర్ దిషా అని పోస్టుల పెడుతుంటే...కొందరు పోకిరీలు మాత్రం ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వాట్సప్, ఫేస్ బుక్ లలో అసహ్యంగా కామెంట్లు పెట్టారు...అంతే కాకుండా అమె ప్రవర్తనపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు...వారేమీ చదువు లేని వాళ్ళు కాదు...ఉన్నతమై చదువు అభ్యసిస్తున్నవారే...కుటుంబ సభ్యులు బాధ చూసి .....అంత రాత్రి సమయంలో దిషా తన సోదరికి ఫోన్ చేసి ఆందోళనగా మాట్లాడుతుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకులు మాత్రం ఆమె ప్రవర్తనను కించపరుస్తూ అసభ్యకరంగా కామెంట్లు పెట్టారు...దీంతో వారిపై నెటిజెన్లు దుమ్మెత్తి పోశారు...దీన్న తీవ్రంగా ఘండించారు..దీంతో ఈ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన సీసీఎస్ పోలీసులు...అసభ్య కామెంట్లు చేసిన ఫేస్ బుక్ స్మైలీ నానీ గ్యాంగ్ గ్రూప్ లో ఉన్న ఇద్దరు యువకులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నిజామాబాద్ కు చెందిన శ్రీరామ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.....నిన్న గుంటూరు జిల్లా అమరావతికి చెందిన ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్ నాని ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. మరో వై రాయదుర్గంలోని ఓ మహిళ వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో అనిల్ కుమార్ అంబాల అనే వ్యక్తి ని సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాయిస్ ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం బంజరాహిల్స్ రోడ్ నంబర్ 12 లో అర్టీసీ తాత్కాళిక డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ద్విచక్ర వాహనంపై వెళుతున్న టీసీఎస్ ఉద్యోగిన సోహిని సక్సేనా అక్కడికక్కడే మృతి చెందింది. ఓ వైపు బార్య చనిపోయిందని భర్త తీవ్రంగా రోదిస్తుంటే....మరో వైపు ఓ పోకిరీ మృతదేహం ముందు ఏ మాత్రం మానవత్వం లేకుండా. సెల్ఫీ తీసుకుంటూ మూర్ఖుడిలా ప్రవర్తించారు..ఇది చూసిన స్థానికుకు అతడి వెకిలి చేస్టలు చూసి ఛీ అనుకున్నారు...చదువుకున్న యువకులు, ఉద్యోగం చేస్తున్నవారే ఇలా మానవాతారాహిత్యంగా ప్రవర్తించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువత ఆలోచనలలో మార్పు రావాల్సన అవసరం ఉంది...అంతే కాకుండా వారు పెడారి పట్టకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉంది.
Last Updated : Dec 5, 2019, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.