ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు, అంగవైకల్యానికి దారి తీస్తున్న రెండో కారణం పక్షవాతమని యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా యశోదా ఆస్పత్రి స్ట్రోక్ కేర్ ఆన్ వీల్స్ పేరుతో స్పెషల్ అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పక్షవాతాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ఈ స్ట్రోక్ కేర్ ఆన్వీల్స్ని అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. స్ట్రోక్ కేర్ ఆన్ వీల్స్ స్పెషల్ ఆంబులెన్స్‌లో సీటీ స్కాన్, మొబైల్ స్ట్రోక్ యూనిట్స్, డాక్టర్ , నర్సు సహా ప్రత్యేకమైన యూనిట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. యశోదా ఆస్పత్రి వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కోమల్ కుమార్, న్యూరో ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
'పక్షవాతాన్ని ఎదుర్కునేందుకు... స్ట్రోక్ కేర్ ఆన్ వీల్స్' - yasodha hospital secendrabad
తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా యశోదా ఆస్పత్రి స్ట్రోక్ కేర్ ఆన్ వీల్స్ పేరుతో ప్రత్యేక అంబులెన్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన ఈ సరికొత్త సేవలను రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ప్రారంభించారు.
ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు, అంగవైకల్యానికి దారి తీస్తున్న రెండో కారణం పక్షవాతమని యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్ రావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా యశోదా ఆస్పత్రి స్ట్రోక్ కేర్ ఆన్ వీల్స్ పేరుతో స్పెషల్ అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పక్షవాతాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ఈ స్ట్రోక్ కేర్ ఆన్వీల్స్ని అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. స్ట్రోక్ కేర్ ఆన్ వీల్స్ స్పెషల్ ఆంబులెన్స్‌లో సీటీ స్కాన్, మొబైల్ స్ట్రోక్ యూనిట్స్, డాక్టర్ , నర్సు సహా ప్రత్యేకమైన యూనిట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. యశోదా ఆస్పత్రి వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కోమల్ కుమార్, న్యూరో ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
TAGGED:
yasodha hospital secendrabad